ఓ యువకుడు తన ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశంలో అతడు తన బ్లేడ్‌తో మర్మాంగాన్ని కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలేం జరిగిందంటే..?
పశ్చిమ బంగాల్లోని కుచ్‌బెహర్ ప్రాంతానికి చెందిన ప్రసన్నజీత్ బర్మన్ అనే యువకుడు ప్రస్తుతం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తన మామయ్య శపన్ బర్మన్తో కలిసి ఉంటున్నాడు. అక్కడే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం ప్రసన్నజీత్‌కు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో ప్రసన్న తరచూ వీడియో కాల్ మాట్లాడేవాడు.
కొన్నిరోజుల క్రితం ప్రసన్నజీత్ తన ప్రేయసితో వీడియోగా మాట్లాడుతుండగా వారిద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల గొడవ తలెత్తింది. దీంతో ప్రసన్నజీత్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. వీడియోకాల్‌లో తన ప్రేయసి చూస్తుండగానే.. పక్కనే ఉన్న బ్లేడ్‌తో తన మర్మాంగంపై దాడి చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న శపన్ రక్తపు మడుగులో పడి ఉన్న తన అల్లుడ్ని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే ప్రసన్నజీత్‌కు చికిత్స అందించారు.