ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలని తీసుకోబోతోంది. ఏపీ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతూ ఉన్న మంత్రి మండలి సమావేశం లో కీలక అంశాలకి పచ్చ జెండా ఊపారు. క్యాబినెట్లో డీఎస్సీ నిర్వహణ నోటిఫికేషన్ జారీ పై చర్చించారు. సుమారు 6000 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడానికి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది ఇలా ఉంటే వైఎస్ఆర్ చేయుట నాలుగో విడత క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూతనిధులు విడుదలకి ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 5000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎస్ ఐ పి బి ఆమోదించిన తీర్మానాలని ఏపీ మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం.