ప్రేమవివాహం చేసుకున్న ప్రేమికులు, అంతలోనే ఆత్మహత్యాయత్నం…!

-

అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన ఓ యువతి, అలాగే కర్నూలు జిల్లా మద్దికేర మండలం కి చెందిన ఓ యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమ లో ఉన్నారు. అయితే వారి విషయం వారి పెద్దలకు చెప్పడంతో కులాలు వేరు కావడంతో ఇంట్లోని పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు ఇంటి నుంచి పారిపోయి బుగ్గ సంగమేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారి పెద్దల నుండి రక్షణ కావాలంటూ మద్దికెర పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఇరు కుటుంబ సభ్యులకు ఎంత చెప్పిన వారు ససేమిరా ఒప్పుకోలేదు.

suscide

దీంతో విసిగిపోయిన పోలీసులు ఆ కేసు తమ పరిధిలోకి రాదని కసాపురం పోలీస్ స్టేషన్ కి వారిని పంపారు. దీంతో ఆ ప్రేమ జంట కు ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి మద్దికేర బస్టాండ్ కు చేరుకున్న ప్రేమికులు అక్కడే విషం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు వారి పరిస్థితిని గమనించి స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version