ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30కు ఆమోదం తెలిపింది కేబినెట్. అధికారిక భాష కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాష కమిషన్ గా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సంబంధించి నాలా చట్ట సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపారు. సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 2,778 పోస్టుల భర్తీకి ఆమోదం
తెలిపింది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.