జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే కాల్ రికార్డింగ్ ఇష్యూలో కీలక పరిణామం నెలకొంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్న సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే దగ్గుబాటి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై..వివరణ ఇచ్చేందుకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రయత్నం చేశారు.

మీ వ్యాఖ్యలు, తీరు ఏమాత్రం సరికాదు’ అంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలసి..వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు.
ఇక అటు జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే కాల్ రికార్డింగ్‌ను లీక్ చేసిన ధనుంజయ నాయుడుకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నుంచి నాకు ప్రాణహాని ఉందని తాజాగా వెల్లడించారు ధనుంజయ నాయుడు.