సిఐడి చీఫ్: చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు… !

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మరియు సీనియర్ పొలిటికల్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. 2014 లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన సమయంలో యువతకు ఉపాధిని కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ స్కీం ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇందులో నిధులు అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ కు తరలించింది. కాగా సిఐడి చీఫ్ సంజయ్ ఈ కేసు గురించి మొదటి రోజు నుండి కీలక విషయాలు తెలియచేస్తూ వస్తున్నారు. ఇక మరోసారి సంజయ్ మీడియా ముందుకు వచ్చి ఈ కేసు గురించి ఒక కీలక విషయాన్ని చెప్పారు. ఈయన మాట్లాడుతూ .. సీఎం చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ కి బడ్జెట్ అనుమతితో పాటుగా మొత్తం 13 చోట్ల సంతకాలు పెట్టారని తెలిపారు. ఈ నిధుల కేటాయింపులు కూడా నియమ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా కాబినెట్ అనుమతులు తీసుకోకుండా స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారన్నారు సిఐడి చీఫ్ సంజయ్.

అంతే కాకుండా ప్రయివేట్ వ్యక్తి గంటా సుబ్బారావుకు దీని బాధ్యతలు ఇవ్వడమే కాకుండా, ఆయన నుండి రూ. 241 కోట్లు ప్రభుత్వ డబ్బును షెల్ కంపెనీ లకు మళ్లించారని వివరంగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news