ఆంధ్రప్రదేశ్ లో వార్డ్ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి పేదల కళ్ళలో కొత్త వెలుగును తీసుకువచ్చిన సీఎం జగన్ తాజాగా ప్రజల కోసం ఎంతగానో కష్టపడుతున్న వలంటీర్ల జీతాల గురించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో వాలంటీర్లు గా పనిచేస్తున్న మూడు లక్షల మందిని దృష్టిలో పెట్టుకుని ఒక మహత్తరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇది వాలంటీర్లకు శుభవార్త అవుతుంది అని చెప్పాలి, ఎందుకంటే ఆగష్టు నెల నుండి వాలంటీర్లకు జీతాలు ఒకటవ తేదీన పడిపోతాయని సీఎం జగన్ ప్రకటించారు. ఇలా జరగడానికి ప్రభుత్వం apcfss.in లో మార్పులు చేయడానికి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇక మీదట వాలంటీర్ల జీతాలు అయిన తర్వాతనే.. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయండి అంటూ జగన్ అధికారులకు చెప్పడం జరిగింది.
ఇకపై ఏ ఒక్క వాలంటీర్ కు లేట్ గా జీతం రాదు, ఇంకా వాళ్ళు దైర్యంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగి కన్నా ముందుగా జీతం అందుకుంటున్నాము అని.. ఇది జగనన్న అంటే !