నేడు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం

-

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్ మరోసారి వార్నింగ్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొనని నాయకులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సమావేశమవనున్నారు.

ఇంటింటికీ సరిగ్గా తిరగని ఎమ్మెల్యేలకు ఈ సమావేశంలో సీఎం చివరి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఆయన కార్యాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గత వారమే ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్న పలువురు ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు. మరోవైపు గత సమావేశం నాటికి అసలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించని ఎమ్మెల్యేలను జగన్‌ గట్టిగానే హెచ్చరించడంతో తర్వాత నుంచి వారు గడప గడపకూ వెళ్లడం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ మేర తిరిగారనే అంశంపై బుధవారం సమీక్షించడంతోపాటు, వారి పనితీరుపై వచ్చిన సర్వే పైనా సీఎం చర్చించనున్నట్లు తెలిసింది. 175  నియోజకవర్గాలకూ పార్టీ పర్యవేక్షకుల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news