రెండువారాల క్రితమే హాస్తినకు వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన జగన్… మంగళవారం మరోసారి హస్తిన టూర్ కి బయలుదేరబోతున్నారు. ఇందులో భాగంగా పధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు! అయితే… జగన్ హస్తిన యాత్ర, ప్రధానితో భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు ఇవే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.. దాదాపు ఇదే ఫైనల్ అవ్వొచనేది విశ్లేషకుల అభిప్రాయం కూడా!
జగన్.. ప్రధాని మోడీ వద్ద ప్రధానంగా ప్రస్థావించే అంశాలు మూడు ఉన్నాయని అంటున్నారు! వాటిలో మొదటిది.. పోలవరానికి సంబందించిన నిధుల టాపిక్! రెండోది.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు! కాగా, మూడవది.. రాజధాని భూములపై సీబీఐ దర్యాప్తు! అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!
ఇక మోడీ.. జగన్ వద్ద ప్రధానంగా ప్రస్థావించే అంశం కూడా ఒకటి ఉందని అంటున్నారు! ఇటీవల ఎన్.డి.ఏ. నుంచి వ్యవసాయ బిల్లు విషయంలో మిత్రపక్షం అకాలీదళ్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఒక్కో పార్టీ ఎన్.డి.ఏ. కు వివిధ కారణాల వల్ల ఇలా దూరమవుతున్న నేపథ్యంతో పాటు.. రాహుల్ గాంధీ కూడా దూకుడు ప్రదర్శించడం.. మొదలైన కారణాలవల్లో ఏమోకానీ.. కేంద్ర కేబినెట్ లోకి వైసీపీని ఆహ్వానించనున్నారంట!
ఇలా రాష్ట్రం కోసం జగన్ కోరికల చిట్టా విప్పనుంటుండగా.. పార్టీ భవిష్యత్తుకోసం మోడీ కూడా తన కోరికలను జగన్ వద్ద ప్రస్థావించనున్నారన్నమాట!!