అవినీతికి అన్న చంద్రబాబు, తమ్ముడు సబ్బం హరి

-

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ ఆమర్నాధ్ టీడీపీ నేత సబ్బం హరిపై తీవ్ర విమర్శలు చేసారు. సబ్బం హరి పార్క్ స్థలాన్ని అక్రమించారని మండిపడ్డారు. సబ్బం హరి ఆధీనంలో2 కోట్ల విలువైన 200 గజాల భూమిని స్వాధీనం చేసుకున్నారు జీవీఎంసీ అధికారులని అన్నారు. సబ్బం హరి కేవలం 10 సంవత్సరాల ప్రజాప్రతినిధిగా పని చేసి, ఎన్ని ఆస్తులు కూడబెట్టారో ప్రజలకు తెలుసని ఆయన ఆరోపించారు.

సబ్బం హరి నాకు తెలిసి పొలిటికల్ బ్రోకర్ అని అన్నారు. జై సమైక్యాంధ్ర పార్టిలో ఆయన ఏం చేశారో ప్రజలకు తెలుసని ఆయన దుయ్యబట్టారు. అవినీతిలో పెద్ద నేతలకు టీడీపీ లో ఉన్నత పదవులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కరకట్ట భూమి పై ఇంద్రభవనం కడతారని, అవినీతికి అన్న చంద్రబాబు, తమ్ముడు సబ్బం హరీ అంటూ విమర్శించారు. వైసీపీ నేతలు కబ్జా చేశారని టిడిపి నేతలు ఆరోపించారు. ఒక్క ఆరోపణపై రుజువుగా చూపించగలరా అని సవాల్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version