2022-23 రుణ ప్రణాళిక లక్ష్యాలపై సీఎం జగన్‌ సమీక్ష

-

నేడు సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఇందులో గత ఏడాది ఎంతమేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నది బ్యాంకర్లు తెలిపారు. ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపుగా ఇచ్చామనీ, మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువ రుణాలు ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రస్ధాయిలో ప్రాథమిక రంగానికి 2022-23 ఏడాదికి రుణప్రణాళిక లక్ష్యం రూ. 2,35,680 కోట్లు కాగా, ఇచ్చిన రుణాలు రూ. 2,34,442 కోట్లని బ్యాంకర్లు తెలిపారు. దీంతో 99.47శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వెల్లడించారు.

వ్యవసాయరంగానికి రుణాల లక్ష్యం రూ. 1,64,740 కోట్లు కాగా 1,72,225 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇది 104.54 శాతం అన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ. 50,100 కోట్లు కాగా, రూ. 53,149 కోట్లు ఇచ్చామన్నారు. ఇది 106.09 శాతం అని తెలిపారు. ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ. 1,63,903 కోట్లు ఇచ్చామని బ్యాంకర్లు వెల్లడించారు. ఈ రంగంలో దాదాపుగా రెట్టింపు స్థాయిలో 195.59శాతం మేర రుణాలు ఇచ్చామని వ్యక్తపరిచారు.బ్యాంకర్లు అందించిన వివరాలపై స్పందించిన సీఎం జగన్, రాష్ట్రంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ విజయాలు సాధించినందుకు సంతోషిస్తూ వారికి అభినందనలు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించిందని, ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version