ఏపీలో పోలీసు అభ్యర్థులకు అలర్ట్‌.. ఫిజికల్ ఈవెంట్లు వాయిదా

-

ఏపీలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 14 నుంచి నిర్వహించాల్సిన ఫిజికల్ ఈవెంట్లను పోలీసు నియామక మండలి వాయిదా వేసింది. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈవెంట్లను వాయిదా వేసినట్లు పోలీసు నియామక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఫిజికల్ ఈవెంట్ల తేదీలను ప్రకటించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి మార్చి 13 నుంచి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించబోతున్నారు.

ఏపీలో 6100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 30 నుంచి జనవరి 7 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. పరీక్షకు హాజరైన వారిలో 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version