బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరిపై వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైర్

-

వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చెంపల మాదిరిగా రోడ్లను నిర్మిస్తానంటూ బిధూరి చేసిన వ్యాఖ్యలన తీవ్ర వేదనతో ఖండిస్తున్నానని షర్మిల అన్నారు. బీజేపీ ఆలోచనలు, చర్యలు, సంస్కృతి వారి నాయకులకు మహిళల పట్ల పూర్తి అగౌరవాన్ని చాటుతుందన్నారు. బిధూరి వ్యాఖ్యలు శిక్షార్హతతో కూడిన విషపూరితమైన సెక్సిజంతో కూడుకున్నాయని మండిపడ్డారు.

తమ వైఫల్యాలు, దురాగతాల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకే సోనియా, రాహుల్ పైనా వ్యక్తిగత దాడులకు బీజేపీ పాల్పడుతుందని షర్మిల ఆరోపణలు చేశారు.తాజాగా ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని… మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్‌లను కూడా బీజేపీ నేతలు కూడా వదిలిపెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బిధూరి.. కల్కాజీ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం అతిషిపై పోటీ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version