ఏపీ లో ఆగని కరోనా జోరు …!

-

ఏపీలో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా మీడియాకు విడుదల చేసింది. ఇక ఇందులో గడిచిన రోజులో 16,712 శాంపిల్స్ పరీక్షించగా, అందులో 1263 కేసులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 59 మంది కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో నేడు ఒక్కరోజే రాష్ట్రంలో 1322 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యతో రాష్ట్రంలోని కరోనా కేసులు 20 వేల మార్కును దాటింది. తాజా కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20019 కు చేరుకుంది.

ap corona

మరోవైపు కరోనా నుండి కోలుకొని 424 మంది ఆసుపత్రి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా వ్యాధి బారినపడి రాష్ట్రవ్యాప్తంగా 7 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 239 చేరుకుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10860 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 197 కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.  ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2587 కేసులు నమోదయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version