అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగుల వయో పరిమితిని తగ్గిస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ విభజన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఉద్యోగుల వయసు 60 ఏళ్లకు పెంచారు. ఇప్పుడు ఉద్యోగుల వయసును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. తమ ఉద్యోగ వయోపరిమితి తగ్గిస్తారా అంటూ మదన పడుతున్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్.. రిటైర్మెంట్ వయసు తగ్గిస్తున్నారా?
-