ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ .. ఆర్టీపీసీఆర్ టెస్టు ధ‌ర త‌గ్గింపు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉధృతి ఎక్కువ గా ఉంది. ఆంధ్ర ప్ర‌దేశ్ లో నిన్న ఒక్క రోజు దాదాపు 7 వేల వ‌ర‌కు క‌రోనా కేసులు వెలుగు చూశాయి. అయితే టెస్టు పెరిగితే.. పాజిటివిటీ రెటు పెరిగే అవకాశం ఉంది. కానీ క‌రోనా నిర్ధార‌ణ‌కు చేసే ఆర్టీపీసీఆర్ టెస్టు ధ‌ర కొన్ని ప్రాంతాల‌లో ఎక్కువ గా ఉంటుంది. దీంతో చాలా మంది క‌రోనా నిర్ధార‌ణ కు ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవ‌డం లేద‌ని బ‌హిరంగ స‌త్యం.

అయితే థ‌ర్డ్ వేవ్ వ‌స్తున్న స‌మ‌యంలో ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ టెస్టు ధ‌రల‌ను త‌గ్గిస్తు నిర్ణ‌యం తీసుకుంది. ఐసీఎంఆర్ గుర్తింపు ఉన్న ఎన్ఏబీఎల్ ప్ర‌యివేటు ల్యాబ్ ల‌లో ఇక నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టు ధ‌ర రూ. 350 ఉండ‌నుంది. గ‌తంలో ప్ర‌భుత్వం క‌రోనా నిర్ధార‌ణ‌కు పంపిచే శాంపిల్స్ ను టెస్టు చేయ‌డానికి రూ. 499 ఉండేది. కానీ తాజా గా ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో ఆర్టీపీసీఆర్ ధ‌ర ప్ర‌స్తుతం రూ. 350 గా ఉండ‌నుంది. ఆస్ప‌త్రులు, ల్యాబ్ ల‌లో కొత్త ధ‌ర‌ల‌ను అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version