ఇవాళ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం బ్లాక్ 1లో భేటీ కానుంది. పరిశ్రమలకు ఏపీఐఐసీ భూ కేటాయింపులను ర్యాటిఫై చేయనుంది ఏపీ క్యాబినెట్. 35 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించిన 112 ఎకరాల భూ కేటాయింపుల పై చర్చించనుంది మంత్రి మండలి. దీంతో 2,211 కోట్ల పెట్టుబడులు, 2,443 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి ప్రతిపాదిత పరిశ్రమలు.
అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన పై చర్చ జరిగే అవకాశం కల్పించనుంది. తిరుపతిలో నోవాటెల్ బ్రాండ్ కింద ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు ప్రతిపాదన పై చర్చించే అవకాశం ఉంది.కృష్ణా జిల్లా మల్లవల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన పై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది.