విజయ్ సేతుపతి మూవీపై డైరెక్టర్ శంకర్ ప్రశంసల వర్షం..

-

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ‘సైరా’,‘ఉప్పెన’ చిత్రాలతో తెలుగు సినీ లవర్స్ ఫేవరెట్ యాక్టర్ అయిపోయారు విజయ్ సేతుపతి. ఆయన నటించిన ‘మామనిదన్(మహామనిషి)’ పిక్చర్ ఇటీవల విడుదలైంది. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతున్నది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిగా విజయ్ సేతుపతి నటన అత్యద్భుతమని ప్రేక్షకులు అంటున్నారు. తాజాగా ఈ సినిమాను ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ వీక్షించారు.

ట్విట్టర్ వేదికగా సినిమాపైన తన అభిప్రాయాన్ని డైరెక్టర్ శంకర్ ట్వీట్ చేశారు. మామనిదన్ సినిమా చూశాక తనకు ఒక మంచి సినిమా చూసిన సంతృప్తి కలిగిందని, డైరెక్టర్ శ్రీను రామస్వామి ఈ సినిమాలో తన హృదయం, ఆత్మను పెట్టి చక్కటి క్లాసికల్ ఫిల్మ్ తీశారని కొనియాడారు డైరెక్టర్ శంకర్. ఇక విజయ్ సేతుపతి నటనకు గాను జాతీయ అవార్డు దక్కాల్సిందేనని పేర్కొన్నారు RC 15 డైరెక్టర్.

ఇళయరాజా, యువన్ శంకర్ రాజాల మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేసిందని, చిత్రానికి మ్యూజిక్ యే హైలైట్ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ శంకర్. శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తు్న్న ఈ పిక్చర్ కు స్టోరి కార్తీక్ సుబ్బరాజ్ అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version