మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సివిల్ అసిస్టెంట్ తో పాటు పలు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. మెడికల్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
APVVP హాస్పిటల్స్‌లో సర్జన్ పోస్టులు వున్నాయి. వివరాలను చూస్తే… ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలతో పాటు పల్లెల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ పోస్టుల కోసం దీన్ని విడుదల చేసారు. అయితే ఈ పోస్టులను వాక్-ఇన్- ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తున్నారు.
400కి పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక ఖాళీల వివరాలను చూస్తే.. రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫొరెన్సిక్ మెడిసిన్ మొదలైన వాటిలో ఈ ఖాళీలు వున్నాయి. వయసు 42 ఏళ్లకు మించకూడదు. ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ ప్యాస్ అయి ఉండాలి. అక్టోబర్ 19 నుంచి ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ స్టార్ట్ అవ్వనుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు.
అక్టోబర్ 19న ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ రేడియాలజీ పోస్టుల కొరకు ఇంటర్వ్యూ జరుగుతుంది.
అక్టోబర్ 20న జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, చర్మ శాస్త్రం, మైక్రోబయాలజీ అండ్ సికియాట్రి పోస్టుల కొరకు ఇంటర్వ్యూ జరుగుతుంది.
అక్టోబర్ 21న ప్రసూతి అండ్ గైనకాలజీ (OBG),ఆర్థోపెడిక్స్, నేత్ర వైద్యం అండ్ పాథాలజీ విభగాల్లో పోస్టుల కొరకు ఇంటర్వ్యూ జరుగుతుంది
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: ఆఫీస్ ఆఫ్ ది డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ గవర్నమెంట్, ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట్, విజయవాడ , ఏపీ 520003.