హిందూ మత సాంప్రదాయాల ప్రకారం ప్రతీ మూగప్రాణికి, దైవత్వానికి సంబందం ఉంటూనే ఉంటుంది. ఆ మూగజీవి దేవుడి వాహనమో, వారి ఆలయం ముందు అలంకరణో.. ఒక్కోసారి దేవుడి రూపాల్లో అదొక ప్రతిరూపమో… ఏదైనా కావచ్చ! కానీ.. మూగజీవాలలోనూ దైవత్వాన్ని చూసే సాంప్రదాయం భారతీయుల సొంతం. ఈ క్రమంలో వాటి బాగోగులు మాత్రం ఎవరు చూస్తారు.. వాటికి ఏమైనా అయితే వాటిపైనే ఆధారపడి బతుకు పండి నడుపుకునే కామందు పరిస్థితి ఏమిటి? ఈస్థాయిలో కూడా ఆలోచించగల సామర్థ్యం, మనసు తన సొంతమని నిరూపించే పనికి పూనుకున్నారు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్!
ఇందులో భాగంగా… మూగప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల యజమానులు, పెంపకం దారులకు ఆసరాగా నిలిచేందుకు “వైఎస్సార్ పశుసంరక్షణ” పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఆరోగ్య సంరక్షణ కార్డులు అందించి… పశువులు, గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని సంరక్షించనుంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా యానిమెల్ హెల్త్‌కార్డుల ద్వారా పశుసంపద కలిగిన రైతులకు, గొర్రెల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇదే క్రమంలో… ఈ “వైఎస్సార్ పశు నష్టపరిహార” పధకానికి సంబందించి పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింప చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా… పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేల నష్ట పరిహారం అందించనుంది ఏపీ సర్కార్.