విద్యుత్ ఉత్ప‌త్తి విషయంలో ఏపీ ప్ర‌భుత్వం చిల్ల‌ర‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

-

నాగార్జున సాగర్ నీటి వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కృష్ణానది యాజమాన్య బోర్డు కు ఫిర్యాదు చేయడంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం పై ఏపీ ప్రభుత్వం అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పవర్ గ్రిడ్ లను కాపాడుకోవడానికే కొన్నిసార్లు నాగార్జున సాగర్ నీటిని వినియోగిస్తున్నామని అన్నారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం సాగర్ నీటిని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. పవర్ గ్రిడ్ లను కాపాడుకోవడానికి ఐదు నుంచి పది నిమిషాల పాటు మాత్రమే ఉపయోగిస్తామని అన్నారు. ఇలా చేయడం సహజమైన అంశమే అని అన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం నీటిని ఉపయోగించడం లేదని అన్నారు.

కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము శ్రీశైలం నీటిని ఉపయోగిస్తున్నారని కృష్ణానది యాజమాన్య బోర్డు కు ఫిర్యాదు చేస్తుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్ర ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నీటి తెలియదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news