ఏపీ ప్రభుత్వ విప్ సామినేనికి కరోనా పాజిటివ్

-

ఏపీలో కరోనా రోజు రోజుకీ కరోనా విజ్రుంభిస్తోంది. రోజూ పదివేలకు పైగా కేసులు నమోదవడం సుమారు వంద మందికి పైగా మరణించడం టెన్షన్ కలిగిస్తోంది. అయితే మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. రోజూ ఎవరో ఒకరు పాజిటివ్ అని తేలుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వ విప్, జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. గత నెల 26నే తనకు వైరస్ సోకిందన్న ఆయన హోం ఐసోలేషన్ లో పద్నాలుగు రోజులు ఉండడంతో నెగటివ్ వచ్చినట్టు తెలిపారు. అలానే ఎవరికయినా కరోనా సోకగానే టెన్షన్ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తన ఆరోగ్యం విషయంలో ఎటువంటి టెన్షన్ లేదన్న ఆయన ఇప్పుడు తనకు కరోనా తగ్గిందని పేర్కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తాను కొద్దిరోజులు ఆగి ప్లాస్మా కూడా డొనేట్ చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news