ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ కార్యదర్శిగా వై భాను ప్రకాష్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కోవిడ్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారి రాజమౌళిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కరోనా బారిన పడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. కరోనా ఆస్పత్రుల సామర్థ్యం, సన్నద్ధత పర్యవేక్షణ తదితర బాధ్యతలను రాజమౌళి పర్యవేక్షించనున్నారు.
దేశంలో కరోనా టెస్ట్‌లను అత్యధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రపదేశ్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇకపోతే శుక్రవారం నాడు రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 21,020 శాంపిల్స్ ను పరిక్షించగా అందులో 1576 కేసులు ఏపీలో నమోదవ్వగా, మిగతా 32 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది.