అమ్మ ఒడి పథకం యథాతథం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన

Join Our COmmunity

అమ్మ ఒడి పథకం యథాతథంగా కొనసాగుతుందని తేల్చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన జీఓ కూడా ఇప్పటికే విడుదల అయ్యిందని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది గ్రామీణ ప్రాంతంలో కాదని అన్నారు. తల్లులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్న ఆయన ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు లో అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం సోమవారం ప్రారంభిస్తారని అన్నారు.

నిజానికి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అమ్మ ఒడి పథకానికీ కోడ్‌ అడ్డంకిగా మారే అవకాశం ఉందని అన్నారు. సోమవారం నెల్లూరులో  అమ్మ ఒడి రెండవ విడత కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా నిబంధనలతో సీఎం కార్యక్రమం వాయిదా పడుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్నా, బడ్జెట్‌ కేటాయింపులు చేసినా సరే పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేసినట్టే అని లేఖలో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే అదేమీ లేదని తేల్చేశారు మంత్రి సురేష్. 

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news