గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు అనంతపురం కు చెందిన భారతి.. ఈమె కథను వింటే రాయి అయినా కరిగిపోవాల్సిందే. అంతలా కటిక పేదరికంలో పుట్టి చదువు కోసం ఎన్నో కష్టాలను అనుభవించి పిహెచ్ డి కెమిస్ట్రీ లాంటి ఉన్నత విద్యను అభ్యసించింది. తనకు చదువు మీద ఉన్న శ్రద్ధను గ్రహించిన ప్రభుత్వం ఆమె ఆసక్తికి మురిసిపోయింది. భారతి కూలి పనులకు వెళుతూనే మరో వైపు చదువుకుంటూ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇక శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీ నుండి పిహెచ్ డి చేసింది. ఈమె కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆమెకు రెండెకరాల వ్యవసాయ భూమిని ఉచితముగా అందించింది. ఈ రోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి భూమిపాత్రలను అందించారు. ఇంకా కలెక్టర్ ఈమెకు జూనియర్ లెక్చరర్ పోస్ట్ ను కూడా ఆఫర్ చేయడం విశేషం.
పిహెచ్ డి చేసిన భారతికి రెండెకరాల భూమిని ఇచ్చిన ఏపీ ప్రభుత్వం…
-