ఏలూరు వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన మాటలు రాష్ట్రాన్ని కొని రోజుల పాటు ప్రశాంతంగా లేకుండా చేశాయి. పవన్ వాలంటీర్లు ప్రజల నుండి తీసుకుంటున్న సమాచారం వలన మహిళలు కిడ్నప్ లకు గురవుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి చూశాము. కాగా ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రెచ్చిపోయి పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. కాగా ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం PAWNA కళ్యాణ్ పై కేసులు పెట్టొచ్చని ఉత్తర్వులను జారీ చేసింది. వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై CRPC 199 /4 ప్రకారం కేసులు నమోదు చేయడానికి గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ అనుమతిని ఇచ్చింది.
ఇక పత్రికలలో వచ్చిన ఆర్టికల్స్ ఆధారంగా పరువు నష్టం కింద కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యుటర్ లకు చెప్పింది. మరి తొందరలోనే పవన్ పై కేసులు నమోదు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.