ఏపీ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త చెప్పింది. పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేసింది. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల జిపిఎఫ్ లోన్లను క్లియర్ చేసింది. పెండింగ్ నిధుల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజులుగా పోలీసులకు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని విడుదల చేశారు. ఇక అటు విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు ఇవాళ తల్లుల ఖాతాలో జమ చేయనుంది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. తిరువూరులో ఏర్పాటు చేసే సభలో పాల్గొని… బటన్ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 700 కోట్ల రూపాయలు జమ అవుతాయి.