హైరిస్క్‌ ప్రాంతాలుగా తెలంగాణ, కర్ణాటక : ఏపీ

-

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. వారు క్వారంటైన్ లో ఉన్న 5వ రోజు, 7 రోజున కోవిడ్ టెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల నుంచి 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా టెస్టు చేయాలని.

విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేసి, ఆ తర్వాత వారందరికీ 14 రోజుల హోం క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్‌గా టెస్టులు చేసి, వారికీ 14 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఇక రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేసి.. తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version