ఏపీలో నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి అయినట్టే అనిపిస్తుంది. నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఏపీ సర్కార్ ప్రతిపాదించినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్చలు జరిపి నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి నుంచి మోషేను రాజు, గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లా నుంచి ఆర్ వి రమేష్, తూర్పు గోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తుల పేర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసి.. ఆమోదం కోసం ఏపీ గవర్నర్ వద్దకు పంపారు.

అయితే దీని పై మరో రెండు రోజుల్లో గవర్నర్ ఆమోదముద్ర వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న నలుగురు ఎమ్మెల్సీ పదవులు శుక్రవారంతో ముగియనున్నాయి. ఆ స్థానంలో ఏపీ ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్సీలను నియమిస్తూ..  ఆమోదం కోసం ఆ ఫైలును గవర్నర్ వద్దకు పంపింది.