పవన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు..!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అడుగడుగునా పోలిసుల అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. కాకినాడ లో హుకుంపేట-రైల్వేస్టేషన్ మధ్య రోడ్డుపై గుంతలు పూడ్చడానికి జనసేన తరలించిన మిక్సర్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ వాహనాల్లో తారు మిక్సింగ్ చేసి గుంతలు పూడ్చేలా జనసేన నాయకులు మెటీరియల్ సిద్ధం చేశారు. వీటిని గుంతలున్న ప్రాంతానికి తరలించకుండా పోలీసులు నిలిపివేసి అడ్డుకున్నారు.

pawan kalyan
pawan kalyan

అయినా ఏదోలా తారు మిక్సర్లు తరలించడానికి జనసేన కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క పవన్ సభ జరిగే బాలాజీపేట వద్ద కుర్చీలు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం పవన్ ప్రసంగించే బస్ ఒక్కటే అక్కడ కనిపిస్తుంది. అయితే ఆ బస్సు చుట్టూ కూడా పోలీసులు మోహరించడం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా జనసేన చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం తో జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా జనసేన కార్యకర్తల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news