నేటితో ముగియనున్న బండి‌ సంజయ్ పాదయాత్ర

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ చేస్తున్న పాదయాత్ర నేటితో ముగియనుంది. హుస్నాబాద్ నియోజక వర్గం లో ఈ ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. ఈ నేపథ్యం లో ఇవాళ మధ్యాహ్నం హుస్నాబాద్ లో ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.

మెత్తం 36 రోజుల పాటు 438 కిమీ పాదయాత్ర చేసిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌… ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 7నియోజకవర్గాల్లో నడిచారు. మెత్తం 35 సభల్లో ప్రసంగించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌. రైతులు, నిరుద్యోగులు, మహిళల తో సహా.. వివి ధ వర్గాల నుంచి సుమారు 14 వేల వినతి పత్రాలు స్వీకరించారు బండి సంజయ్‌ కుమార్‌. ఇక బండి సంజయ్‌ నిర్వహించిన పాదయాత్ర లో ఏకంగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు, 24 మంది జాతీయ నాయకులు పాల్గొన్నారు.ఇక ఇవాళ బండి సంజయ్‌ పాదయాత్ర ముగియనుంది.