మాజీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేసిన ఏపీ

-

మాజీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నెల 30 తేదీన కెఎస్ జవర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు అని పేర్కొంది. ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డికి నిన్న పోస్టింగ్ ఇచ్చారని వెల్లడించారు. జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఆ విభాగం పూర్తి అదనపు బాధ్యతలను అనంతరాముకు అప్పగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సాధారణ పరిపాలన శాఖ జీపీఎం-ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉద్యోగ విరమణను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇక ఈ విభాగం పూర్తి అదనపు బాధ్యతలను పోలభాస్కర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఉద్యోగ విరమణను జూన్ 30 తేదీగా నోటిపై చేసింది. కె.వెంకటరమణా రెడ్డి కూడా జూన్ 30 తేదీన ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news