ఎంపీ రఘురామ పై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈనేపథ్యంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయటంతో పాటు ఈ కేసులో తదుపరి చర్యల నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ క్రమంలో రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
అయితే.. విచారణ చేపట్టిన హైకోర్టు రఘురామ రాజు తరుపున వాదనలు తోసిపుచ్చిస్తూ.. రఘురామకృష్ణంరాజుకు షాక్ ఇచ్చింది. అంతేకాకుండా.. రఘురామరాజును సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతించింది. హైదరాబాదులోని దిల్ కుశా గెస్ట్ హౌస్‌లో విచారణకు సీఐడీకి అనుమతి ఇచ్చింది హైకోర్టు.