ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఈ రోజు నుంచి మూడు రోజుల్లో ఏపీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డను కలవాలని ఏపీ హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థలు జరపలేమని ప్రభుత్వం చెబుతున్న వివరాలను అధికారులు ఆయనకు వివరించాలని పేర్కొంది.
ఎక్కడ కలవాలి అనే విషయాన్ని నిమ్మగడ్డ తెలియజేస్తారని హైకోర్టు పేర్కొంది. ఒకవేళ గనుక ప్రభుత్వం అలానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మధ్య చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి మరల వాదనను వింటామని హైకోర్టు పేర్కొంది. ఇక ఎలా అయినా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, అలానే రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఈ వివాదం ఇప్పట్లో తగ్గేలా మాత్రం కనిపించడం లేదు. చూడాలి మరి ఏమవుతుందో ?