ఎమ్మెల్యేల కొనుగోలు..ఎవరు ఎవరిని కొన్నారు!

-

మొన్నటివరకు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనం సృష్టిస్తే..ఇప్పుడు ఏపీలో ఆ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేయడంతో టి‌డి‌పి గెలిచింది. అదే సమయంలో టి‌డి‌పికి చెందిన నలుగురు వైసీపీలోకి వెళ్ళి..ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన అంశం తెలిసిందే. అయితే ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేయడంపైనే చర్చ నడుస్తోంది.

పైగా నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ సస్పెండ్ చేయడం విశేషం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ పనిచేయదు..దీంతో వారిపై అనర్హత వేటు వేయలేరు. ఈ క్రమంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేసినట్లు నిర్ధారణకు వచ్చి..వారిపై వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక ఈ సస్పెన్షన్ వల్ల ఆ రెబల్ ఎమ్మెల్యేలకు పోయేదేమీ లేదు.ఇంకా వారు ఫ్రీ గా ఉంటారు. ఇప్పటికే వారు వైసీపీ నుంచి బయటకు రావాలని డిసైడ్ అయ్యారు. అందుకే టి‌డి‌పికి అనుకూలంగా ఓటు వేశారు.

అలాంటప్పుడు వారిని సస్పెండ్ చేసిన పెద్ద ఉపయోగం లేదు. అదే సమయంలో ఎమ్మెల్యేలని చంద్రబాబు కొనుగోలు చేశారని..ఒక్కో ఎమ్మెల్యేకు 15-20 కోట్లు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అయితే రాజకీయంగా ఆరోపణలు చేయడంలో తప్పు లేదు..కాకపోతే లాజిక్ లేని ఆరోపణలు అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే వైసీపీ సైతం టి‌డి‌పి నుంచి నలుగురు ఎమ్మెల్యేలని తీసుకుందని, వారి చేత వైసీపీకి అనుకూలంగా ఓటు వేయించుకున్నారని, మరి అలాంటప్పుడు వారికి ఎంత ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయని అంటున్నారు.

ఇక ఎన్నికల సమయం దగ్గర ఉంది..అలాంటప్పుడు అన్నీ కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్సీ కోసం టి‌డి‌పి రిస్క్ చేయడం అనేది కష్టమనే అంటున్నారు. కాబట్టి చివరికి ప్రజలని ఎవరిని నమ్ముతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version