బడా ఈవెంట్లో మీడియా ముందే అలా చేసి వైరల్ అవుతున్న రన్వీర్ దీపికా!

-

బాలీవుడ్ స్టార్ కపుల్ రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే పెళ్లినాటి నుంచి ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వస్తున్నారు. అలాగే మీడియా ముందు సైతం వీరిద్దరూ జంటగా కనిపించి వావ్ అనిపిస్తారు. బీటౌన్​ జంటలలో చాలా డిఫరెంట్​గా కూడా కనిపిస్తుంటారు. పర్సనల్​, ప్రొఫెషనల్​ లైఫ్​లో ఒకరి పట్ల మరొకరు ఎంతో గౌరవంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు. అయితే తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన దీపిక రన్వీర్ సింగ్ మధ్య జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

తాజాగా ఓ బడా ఈవెంట్ కు హాజరయ్యారు దీపికా పదుకొనే రన్వీర్ సింగ్. అయితే ఈవెంట్లో రన్వీర్ పక్కనే ఉండి చేయి అందిస్తున్న పట్టించుకోకుండా దీపిక ముందుకు వెళ్ళిపోయారు. ఈ విషయం అక్కడే ఉన్న మీడియా కంట పడటంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య ఏం జరిగింది అంటూ పలు రకాలుగా మార్పులు వినిపిస్తున్నాయి..

కాగా ఈ గ్రాండ్ ఈవెంట్​లో హీరోయిన్ దీపికా ప‌దుకొణె చేయి పట్టుకుని నడిచేందుకు రణవీర్ సింగ్ ఆసక్తి చూపించారు. ముందుగా కారు దిగిన ఆయన.. రెడ్ కార్పెట్​పై నడిచేందుకు దీపిక కోసం ఎదురు చూశారు. దీపిక కారు దిగగానే తన చేయి చాచారు. కానీ దాన్ని చూడనట్టుగానే దీపిక పదుకొణె ముందుకు అడుగులు వేస్తూ నడిచింది. దీంతో రణ్​వీర్​ సింగ్ తన చేయిని కిందకు దించేసి ముందుకు సాగిపోయారు. అనంతరం మళ్లీ అతన్ని దాటుకుంటూ దీపిక వెళ్లిపోయారే తప్ప ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఏం జరిగింది అంటూ పలు రకాల వాదనలు మాత్రం వినిపిస్తూ వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version