దేశంలో ఎక్కడా లేని చెత్త మీడియా తెలుగు మీడియా అని చాలామంది అంటారు. తెలుగు మీడియా కి ప్రజా సమస్యల కంటే కులపిచ్చి రాజకీయ పిచ్చి ఉన్నంత పిచ్చి దేశంలో మరో రాష్ట్రంలో ఉన్న మీడియాలకు ఉండదని చాలా మంది ప్రముఖులు అంటుంటారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ గురించి విలవిలలాడుతుంటే తెలుగు మీడియా మాత్రం రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ వరుస కథనాలు ప్రసారం చేయటం ఇళ్లల్లో ఉన్న చాలా మందికి అసహనాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి మీడియా ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీలు అన్న విషయాలను పక్కనపెట్టి ప్రజల కోసం కలిసికట్టుగా పని చేయాల్సిన పరిస్థితి ఉంది.
పూర్తి విషయంలోకి వెళ్తే గ్రామ వాలంటీర్లు సరిగా పనిచేయడం లేదని..రేషన్ సరుకులు ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదని.. అందువల్లే ఓ మహిళ చనిపోయిందని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ కొన్ని తెలుగు దేశం అనుకుల మీడియా సంస్థలు రెచ్చిపోయి వార్తలు ప్రసారం చేశాయి. దీంతో ఏపీ లో ఉన్న ప్రజలు ఒకపక్క కరోనా వైరస్ గురించి ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న గ్రామ వాలంటీర్లు చాలా వరకు ఇటువంటి సమయంలో రాష్ట్రంలో చాలా మంది ప్రాణాలు పోకుండా తమ ప్రాణాలను అడ్డంపెట్టి పని చేస్తుంటే వారిపై ఎలాంటి కథనాలు ప్రసాదించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు రాజకీయాలకి చేయడం ఇటువంటి టైం లో సిగ్గుచేటు మీరు అసలు మారారు అంటూ సదరు మీడియా ఛానల్ పై మండిపడుతున్నారు ఏపీ ప్రజలు.