స్వరూపానంద సరస్వతికి షాకిచ్చిన ఏపీ సర్కార్

-

ప్రముఖ అధ్యాత్మిక గురువు స్వరూపానంద సరస్వతికి ఏపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖలో శారదా పీఠానికి 15 ఎకరాల స్థలం కేటాయించగా.. దీనిపై దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు ఆ స్థలం అనుమతులను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే విశాఖలో స్వరూపానందకు ఇచ్చిన 15 ఎకరాల స్థలం విలువ ప్రస్తుతం రూ.220 కోట్లు వాల్యూ అయితే, కేవలం రూ.15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టినట్లు ప్రభుత్వం నిర్దారించింది.

దీని ప్రకారం స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు కూటమి సర్కార్ అనుమానిస్తోంది.ఈ క్రమంలోనే స్థలానికి చెందిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదా పీఠం చేపట్టిన నిర్మాణంపై కూడా చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఆదేశాలు అందాయి.

Read more RELATED
Recommended to you

Latest news