ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుదామా వద్దా..? డైలమాలో బీఆర్ఎస్..

-

బీఆర్ఎస్ కు అధికారం పోయింది.. ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు.. ఈ సమయంలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దాఅనే సందిగ్దదంలో ఆ పార్టీ ఉంది.. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల అభ్యర్దులు, స్వంతంత్య్రులు బరిలో దిగేందకు సిద్దమవుతున్నారు.. అయితే బీఆర్ఎస్ మాత్రం మౌన ముద్రలోనే ఉంది..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం..వరంగల్ గ్రాడ్యుయేట్‌ బైపోల్‌లో నిరాశ.. ఈ నేపత్యంలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగుదామా.. వద్ద అన్న డైలమాలో బీఆర్ఎస్ ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.. ఒక వేళ పోటీ చేస్తే.. విజయావకాశాలు ఎలా ఉంటాయి.. అనేదానిపై సంబంధింత నియోజకవర్గ నేతలతో అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది..

మొదటి నుంచి కారు పార్టీకి కలిసి వచ్చిన కరీంనగర్‌ స్థానం నుంచి బరిలోకి దిగాలని, తద్వారా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పలువురు సీనియర్లు అధినేత కేసీయార్ ను కోరారట.. అయితే దీనిపై కేసీయార్ ఎటూ తేల్చుకోలేక ఉన్నారని టాక్ వినిపిస్తోంది.. పోటీ విషయంలో స్పష్టత రానప్పటికీ.. కరీంనగర్‌ మాజీ మేయర్‌, రవీందర్ సింగ్ మాత్రం పోటీకి రెడీ అయిపోతున్నారు. కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే రంగంలోకి దిగుతామని వారు ప్రకటిస్తున్నారు..

అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు రెడీ అవుతున్నాయి. గతంలో ఈ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వరుసపెట్టి గెలిచారు. నారదాసు లక్ష్మణ్, స్వామిగౌడ్..ఇలా వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థిని బరిలో దింపలేదు. స్వతంత్ర అభ్యర్థి, ఉద్యోగ సంఘం నేత చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు తెలిపింది.. ఆ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిచారు. అలా బీఆర్‌ఎస్‌ కంచుకోటను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌.. ఈసారి ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. అయితే వారు కూడా ఇంకా అభ్యర్దిని ఖరారు చెయ్యలేదు..

మరో పక్క బిజేపీ కూడా తమ సత్తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.. కేంద్రమంత్రి సంజయ్‌తో పాటు ముగ్గురు ఎంపీలు రఘునందన్‌రావు, అరవింద్‌, నగేష్‌లతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న పట్టభద్రుల నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. మొత్తంగా కాంగ్రెస్,బిజేపీ పోటీకి సై అంటుంటే.. బీఆర్ఎస్ మాత్రం ఆలోచనలో పడింది..

Read more RELATED
Recommended to you

Latest news