ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను మార్పులు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’గా అమలు చేసిన ఈ పథకాన్ని కూటమి సర్కార్ ‘తల్లికి వందనం’గా పేరు మార్చింది. అయితే, తాజాగా ఈ పథకం ఎప్పుడు అమలులోకి రానుందనే విషయంపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది.
ఈ స్కీమ్ అమలు కోసం ఏపీ ప్రజలు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో వచ్చే జనవరిలో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నా వారి అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది.ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.20వేల లబ్ధి చేకూర్చే ‘అన్నదాత సుఖీభవ’ను మార్చి లేదా ఏప్రిల్‌లో అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.