సచివాలయ తరలింపుకి ముహూర్తం ఫిక్స్

-

ఏపీ సచివాలయాన్ని తరలించేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో భాగంగా విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసిన సంగతి తెలిసిందే..అయిదే ఈ బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించిన పనులను చకచకా పూర్తి చేస్తోంది. అందుకే ఏపీ సచివాలయాన్ని అమరావతి నుంచి వైజాగ్ కు తరలించే ప్రక్రియను ప్రారంభించింది.

దీనిపై ఏ క్షణమైనా ఆదేశాలు రావొచ్చని తెలుస్తోంది. మే నెలాఖరు కల్లా విశాఖ వెళ్ళేందుకు ఉద్యోగులంతా సిద్దంగా ఉండాలని ఏపీ సచివాల ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చినా కోర్టు కేసుల వల్ల లేట్ అవుతూ వచ్చిందన్నారు. మరో మూడు నెలల్లో కొత్త విద్యా సంవత్సరం రానుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, తమ పిల్లల్ని ఎక్కడ చదివించాలి, వసతి పరిస్థితులేంటని ఉద్యోగులు అడుగుతున్నారని తెలిపారు. అందుకే కొత్త విద్యాసంవత్సరం పూర్తయ్యే లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్దమవతున్నట్లు తెలిపారు.

దీనికోసం ఉద్యోగుల సంఘం ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఎంత మంది పిల్లలకు విశాఖలో ప్రవేశాలు కావాలి, ఎంతమందికి వసతులు కావాలో అని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వివరాలన్నింటినీ సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news