Ap : రూ.500 బోనస్‌పై నేడు విధివిధానాలు ఖరారు

-

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీల మేరకు రైతులకు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ చేస్తోంది. అందుకోసం విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సీజన్ నుంచి సన్నబియ్యం రకాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించే అంశంపై నేడో, రేపో విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది.

రైతులకు మద్దతు ధర (కామన్ రకానికి రూ.2,300, గ్రేడ్ -ఏ రూ.2,320) బోనస్‌ను విడివిడిగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సన్నాల దిగుబడి 88 లక్షల టన్నులు కాగా, కొనుగోలు కేంద్రాలకు 49 లక్షల టన్నులు వస్తాయని అంచనా. రూ.500ల చొప్పున చెల్లిస్తే రూ.2,455 కోట్ల ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version