దసరా పండుగ నేపథ్యంలో నగరాల నుంచి ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. కొందరు తమ సొంత వాహనాల్లో ప్రయాణానికి ప్లాన్ చేస్తుంటే మరికొందరు రైల్వే, ఆర్టీసీ, ప్రైవేట్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. టికెట్ కౌంటర్ల వద్ద సైతం ఫుల్ రష్ ఉంది. సొంతూళ్లకు ప్రయాణం అయ్యేందుకు తెల్లవారు జాము నుంచే ప్రజలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటున్నారు.
దసరా పండగ కోసం ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను సైతం నడిపిస్తోంది. పండుగ రష్ నేపథ్యంలో రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ ప్యాసింజర్స్ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోగిలు అన్ని నిండిపోతున్నాయి. జనరల్ బోగీలను పెంచాలని మిడిల్ క్లాస్ ప్యాసింజర్స్ డిమాండ్ చేస్తున్నారు.