ఏపీ మూడు రాజధానులు ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడోది నిరుద్యోగము :కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్

-

ఏపీలో ఎన్నికల ఫైట్ తారస్థాయికి చేరింది. పోలింగ్‌కు మరో 6 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు.ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుండగా.. మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలను రచిస్తున్నాడు.

ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోన్న వేళ ముఖ్యమంత్రి జగన్ సర్కార్‌పై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన 3 రాజధానుల ఇష్యూపై తనదైన రీతిలో సెటైర్లు వేశారు. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేశారని.. అవి ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడోది నిరుద్యోగమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన మూడు రాజధానులు ఇవేనని సెటైర్ వేశారు. ఇంతకుమించి గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news