ఏపీలో వాలంటీర్ జగన్ సర్కార్ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా స్థానికులకు ప్రభుత్వం నుండి వచ్చే ఎన్నో పథకాలు దగ్గర అవుతున్నాయి. ఇంటి వద్దకే రేషన్ సరఫరా….ఫించన్ లు తెచ్చి ఇవ్వడం తో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోయాయి. ఇక తాజాగా ఓ వాలంటీర్ చెన్నై లో చికిత్స పొందుతున్న ఓ బాలుడికి అక్కడకు వెళ్లి మరీ పెన్షన్ అందించాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం… రామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జ్యోతి రావ్ అనే బాలుడు తలసేమియా తో బాధపడుతున్నాడు.
ప్రభుత్వం అతనికి నెల నెలా పెన్షన్ లు ఇస్తోంది. అయితే ప్రస్తుతం అతడు చికిత్స నిమిత్తం చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వాలంటీర్ రాముడు నిన్న చెన్నై వెళ్లి అతడికి పెన్షన్ డబ్బులను అందించాడు. దాంతో వాలంటీర్ రాముడు చేసిన పనికి బాలుడి తల్లి తండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం వైరల్ అవుతూ ఉండటం తో వాలంటీర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.