ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం…

-

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు తమ డిమాండ్లను వినిపిస్తూనే ఉన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన జరపుతూనే ఉన్నారు. పార్టమెంట్ శీతాాాకాల సమావేశాలు మొదలైన తొలిరోజు నుంచి టీఆర్ఎస్ ఎంపీలు ఇటు లోక్ సభలో, అటు రాజ్య సభలో స్పీకర్ పోడియం ముందు ప్లకార్డ్ లు పట్టుకుని నినాదాలు చేస్తూ ధాన్యం గురించి చర్చించాలని కోరుతున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు అడిన ప్రశ్నలకు కేంద్రం కూడా సమాధానం ఇచ్చింది.

అయితే టీఆర్ఎస్ ఎంపీలకు మఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. నేడు ప్రగతి భవన్ లో ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్ లో జరిగిన పరిణామాలను ఎంపీలు కేసీఆర్ కు వివరించనున్నారు. ధాన్యం కొనుగోలు విషయంపై తామ తెలిపిన నిరసనను, కేంద్రం స్పందించిన తీరును గురించి ఎంపీలో కేసీఆర్ కు తెలపనున్నారు. ఇదే విధంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు దిశానిర్థేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news