Forbes జాబితాలో కోనసీమ కుర్రాడు

-

ఫోర్బ్స్‌ ప్రకటించిన టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో ఏపీకి చెందిన కుర్రాడికి చోటు దక్కింది. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ చోటు ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించాడు. ఐఐటీ గువాహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్‌ అనే వైద్య సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కొంతమంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నాడు. ఇందులో శివతేజ మెషీన్‌ లెర్నింగ్‌ టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు.

 

ఇక్కడ పరిశోధనలు చేస్తూనే నెదర్లాండ్స్‌లోని మాస్ట్రక్ట్‌ యూనివర్సిటీలో క్లినికల్‌ డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న శివతేజ ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశాడు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఈయన చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్‌ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version