ఆపిల్ బంపర్ ఆఫర్.. రూ.99 కే అన్ని పెయిడ్ గేమ్స్.. టీవీషోలు, మూవీలు కూడా..!

-

నూతన ఐఫోన్ల విడుదల సందర్భంగా ఆపిల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు కేవలం రూ.99 చెల్లిస్తే చాలు అన్ని పెయిడ్ గేమ్స్‌ను ఆపిల్ వినియోగదారులు ఆడుకోవచ్చు. అలాగే నెలకు మరో రూ.99 చెల్లిస్తే ఏకంగా టీవీ షోలు, మూవీలు కూడా వీక్షించవచ్చు.

నూతన ఐఫోన్ల విడుదల సందర్భంగా ఆపిల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు కేవలం రూ.99 చెల్లిస్తే చాలు అన్ని పెయిడ్ గేమ్స్‌ను ఆపిల్ వినియోగదారులు ఆడుకోవచ్చు. అలాగే నెలకు మరో రూ.99 చెల్లిస్తే ఏకంగా టీవీ షోలు, మూవీలు కూడా వీక్షించవచ్చు. కాలిఫోర్నియాలో ఆపిల్ క్యాంపస్‌లో నిన్న జరిగిన ఈవెంట్‌లో ఆపిల్ ఈ ఆఫర్ల వివరాలను ప్రకటించింది.

Apple bumper offer only rs 99 for games and movies

ఆపిల్ సంస్థ ఆపిల్ ఆర్కేడ్ పేరిట గేమింగ్ ప్రియుల కోసం ఓ నూతన గేమ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది. దీనికి గాను ఆపిల్ వినియోగదారులు నెలకు రూ.99 చెల్లించాలి. దీంతో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ టీవీ వినియోగదారులు ఒక్కో గేమ్‌ను విడివిడిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అన్ని పెయిడ్ గేమ్స్‌ను ఈ సర్వీస్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ఈ సర్వీస్ ఈ నెల 19వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది.

ఇక ఆపిల్ కొత్తగా ఆపిల్ టీవీ ప్లస్ పేరిట ఓ వీడియో స్ట్రీమింగ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను కూడా నిన్నటి ఈవెంట్‌లో ప్రకటించింది. ఈ సర్వీస్‌కు కూడా ఆపిల్ వినియోగదారులు నెలకు రూ.99 చెల్లించాలి. దీంతో ఆ యాప్‌లో ఉండే వీడియోలు, టీవీ షోలు, మూవీలను యూజర్లు ఎంచక్కా వీక్షించవచ్చు. కాగా ప్రస్తుతం విడుదలైన ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను కొన్నవారికి ఆపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందివ్వనున్నారు. కాగా ఈ సర్వీస్ నవంబర్ 1 నుంచి ఆపిల్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news