యువత వల్లే వాహనరంగం క్షీణిస్తోందట.. దుమారం రేపుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు..!

-

ప్రధాని మోదీ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశంలో ఆటోమొబైల్ రంగం కుదేలవడానికి కారణం యువతేనని అన్నారు.

రాజకీయ నాయకులకు ప్రజలంటే ఎప్పుడూ లోకువే. ఎప్పుడూ వారిని లక్ష్యంగా చేసుకుని తిక్క వాగుడు వాగుతుంటారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియని అయోమయ వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. దేశంలో ఆటో మొబైల్ రంగం రోజు రోజుకూ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుండడానికి కారణం.. యువతేనని అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

automobile industry falls because of youth says nirmala sitharaman

ప్రధాని మోదీ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశంలో ఆటోమొబైల్ రంగం కుదేలవడానికి కారణం యువతేనని, వారు కార్లు, టూవీలర్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని, ఎక్కువగా క్యాబ్‌లు, ప్రజా రవాణాపై ఆధార పడుతున్నారని, అందుకనే ఆ రంగంలో వాహనాల విక్రయాలు క్షీణించాయని ఆమె అన్నారు. అయితే నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై నెటిజన్లే కాదు, యువత కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆమెను లక్ష్యంగా చేసుకుని బాయ్‌కాట్ మిలీనియల్స్, సే ఇట్ సీతారామన్‌తాయి లైక్ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

సొంత వాహనం ఉంటే డబ్బులు దండగ.. డబ్బులు మిగిలించుకోవాలి కదా.. అందుకనే యువత వాహనాలను కొనడం లేదు.. అని కొందరు సీతారామన్‌కు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు.. కొత్త మోటారు వాహన చట్టం కారణంగా భారీ ఫైన్లు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే చాలా మంది వాహనాలను కొనడం లేదని.. మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్‌పై యువత అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మరి మంత్రిగారు ఈ పోస్టులపై ఎలా స్పందిస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news