అధిక బరువుకి చెక్ పెట్టే ఆపిల్ సైడర్ వెనిగర్…!!

-

ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల అధిక బరువు, ఉబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనే ఉద్దేశ్యం తో ఫాస్టింగ్ ఉండటం, వాకింగ్,వ్యాయామం చేయటం వంటివి చేస్తుంటారు. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ నీ ఇలా వాడితే ఈజీగా అధిక బరువు తగ్గొచని వైద్య నిపుణులు సలహా ఇస్తుంటారు.

ఆపిల్ సిడర్ వెనిగర్ లో ఉన్న ఎసిటిక్ ఆమ్లం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు,అధిక శరీర బరువు, మరియు తొడల చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.దీనిని వాడటం వల్ల 2,3నెలల్లో తరువాత కచ్చితంగా 4 నుండి 5కిలోల వరకు బరువు సులువుగా తగ్గుతారు. ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టేబుల్ స్ఫూన్ నిమ్మరసం వేసి బాగా కలపి, ఉదయాన్నే పరగడుపున కానీ,రాత్రి భోజనం చేసే అరగంట ముందు కానీ ఈ మిశ్రమాన్ని త్రాగాలి . ఇలా రెండు నుండి మూడు నెలలు చేస్తే శరీరం యొక్క మెటబాలిజం ను పెంచి, పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు మరియు మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వును ఈజీగా తగ్గిస్తుంది.శరీరాన్ని యాక్టీవ్ స్టేజ్ లో ఉండేలా చేస్తుంది.అయితే దీనిని తగు మోతాదులో మాత్రమే వాడాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రుని తగ్గిస్తుంది..

ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గించడమే కాకుండా తలలోని చుండ్రుని కూడా ఈజీగా తగ్గిస్తుంది.దీని కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నిమ్మకాయ కలిపి ఈ మిశ్రమాన్ని తలకు బాగా మర్దన చేయాలి.ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ ఫంగల్ లక్షణాలు మరియు విటమిన్ సి యొక్క గొప్ప కంటెంట్ చుండ్రు తగ్గించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది తలలో వచ్చే దురదను తగ్గిస్తుంది.మరియు చుండ్రు వల్ల వచ్చే చికాకు తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news